CHNC360
- గర్భిణులు, చిన్నపిల్లలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని తాడిపత్రి మండల ఆరోగ్య విస్తరణ అధికారి బాల సూర్య నారాయణ అన్నారు. శని వారం మధ్యాహ్నం ఆయన చుక్కలూరు పీహెచ్సీ పరిధిలోని సజ్జలదిన్నె అంగన్వాడి కేంద్రము సందర్శించారు. ఆయా అంగన్వాడి కేంద్రాల్లో దస్త్రాలు, మాతాశిశు సంరక్షణ కార్డులను పరిశీలించారు. అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు ఇమ్యునైజేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించి, తగిన సూచనలు చేశారు. ఈ కార్య క్రమంలో సూపర్వైజర్ కృష్ణ మోహన్, వైద్య సిబ్బంది,ఆశ మరియు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
- మాత శిశు ఆరోగ్యం కోసం “జాతీయ పోషకాహార మాసోత్సవాలు” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చుక్కలూరు.
- అందరి లోను ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అంటే తనను తాను నిందించు కొన్నట్లే అవుతుంది !!! ~భగవద్గీత.
- చంద్రన్న సంచార చికిత్స వాహన సిబ్బంది తో బడి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు!!! పేషెంట్ కు ఆపద వస్తే 108 కు కాల్ చేసి సమీప ఆసుపత్రిలో చికిత్సను పొందే ఆవకాశం ఉంది.కాని PHC లో పని చేసే వైద్యులు అత్యవసరంగా ఇతర గ్రామాలకు వెళ్లి చికిత్సలు అందచేయాలంటే సరైన వాహనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.మహిళా వైద్యులు అంటువ్యాధులు ప్రబలి నప్పుడు గ్రామాల్లో వైద్య శిభిరాలు నిర్వహించాలి అంటే చాల కష్టంగా ఉంది.బడి పిల్లలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించుటకు మండలము లోని అన్ని గ్రామీణ పాటశాలలు విసిట్ చేయాలంటే ప్రభుత్వం వారికి తక్షణం వాహన సౌకర్యం కల్పించ వలిసిందే.ఇతర శాఖల సిబ్బందికి వాహన సౌకర్యం కల్పించిన ప్రభుత్వం అతి త్వరగా వైద్య ఆరోగ్య శాఖ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రములకు కూడా వాహన వసతి కల్పించాలని ప్రభుత్వ వైద్యులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నారు.అలాగే 104 మొబైల్ వాహనం విసిట్ చేసే గ్రామాల్లో బడి పిల్లలకు RBSK పథకము క్రింద అన్ని పరీక్షలు నిర్వహించే టట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment